: కన్న కూతురిని సజీవ సమాధి చేయబోయిన తండ్రి!
కూతురంటే ఇష్టంలేని ఓ కసాయి తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. నిలువెత్తు గొయ్యి తీసి చేతులు కట్టేసి కూతురిని సజీవ సమాధి చేయబోయాడు. ఈ దారుణ ఘటన త్రిపుర సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పదేళ్ల కూతురు అంటే ఇష్టం లేక అబుల్ హుస్సేన్ అనే వ్యక్తి, తన భార్య లేని సమయంలో ఇంటి వెనుక గొయ్యి తవ్వాడు. బాలిక అరవకుండా నోటికి గుడ్డలు కట్టి, చేతులు కట్టేసి గుంటలో దింపాడు. గుండెల వరకూ మట్టి పోసిన తరువాత భార్య వచ్చిన అలికిడికి ఆ బాలికపై డ్రమ్ము కప్పి వెళ్ళిపోయాడు. కూతురు కానరాక తల్లడిల్లిన తల్లి, స్థానికుల సాయంతో వెతుకులాడగా చావుబతుకుల మధ్య బాలిక కనిపించింది. ఆమె ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.