: ముంబైలో భారీ చోరీ... రూ. రెండు కోట్లు ఎత్తుకెళ్లిన సెక్యూరిటీ గార్డు!


దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కొద్దిసేపటి క్రితం భారీ చోరీ జరిగింది. ఓ బ్యాంకుకు చెందిన రూ.2 కోట్లను అదే బ్యాంకులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు ఎత్తుకెళ్లాడు. ఏటీఎంలలో డబ్బు పెట్టేందుకు బయలుదేరిన వ్యాన్ వెంటే భద్రతగా వెళ్లిన సదరు సెక్యూరిటీ గార్డు సినీఫక్కీలో డబ్బును దోచుకుని ఉడాయించాడు. పక్కాగా రచించుకున్న పథకం మేరకు నేటి ఉదయం ఏటీఎంలలో డబ్బు పెట్టేందుకు వెళ్లిన వ్యాన్ వెంట సదరు నిందితుడు కూడా వెళ్లాడు. అయితే తోటి సిబ్బందికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చాడు. ఆ టీ తాగిన మిగతా గార్డులు, వ్యాన్ డ్రైవర్, బ్యాంకు అధికారులు మత్తులోకి జారుకోగానే నిందితుడు డబ్బుతో ఉడాయించాడు. సమాచారం అందుకున్న బ్యాంకు యాజమాన్యం ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకునేందుకు నగర పోలీసులు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News