: క్రికెట్ బ్యాట్ పట్టిన బాలయ్య... నిమ్మకూరు వీడి హిందూపురానికి!
సంక్రాంతి పండగ వేడుకలను కృష్ణా జిల్లాలో ఘనంగా జరుపుకున్న హీరో బాలకృష్ణ ఈరోజు ఉదయం తన నియోజకవర్గం హిందూపురంలో సందడి చేశారు. కాసేపు యువకులతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు. అంతకుముందు బసవ తారక రామారావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత తమలో క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. క్రికెట్ ఆడి నాలుగైదు షాట్లు బాదిన బాలయ్య కాసేపు బౌలింగ్ కూడా చేశారు.