: చేవెళ్ల వద్ద రోడ్లపై మద్యం బాటిళ్లు... తీసుకున్నవారికి తీసుకున్నంత!


ఆ రోడ్డు మీద మద్యం సీసాలుగా కాదు... పెట్టెల్లో దొరుకుతోంది. మద్యం బాటిళ్లు ప్యాక్ చేసిన కార్టన్లు చేవెళ్ల - ముడిమ్యాల రహదారిపై పలు చోట్ల పడి వున్నాయి. రహదారి పొడవునా అక్కడక్కడా మద్యం కార్టన్లు పడిఉండటంతో ఆ దారిలో వెళుతున్న పలువురు తాము మోయగలిగినన్ని సీసాలు ఎత్తుకు వెళ్లినట్టు తెలుస్తోంది. వైన్ షాపులకు మద్యం సరఫరా చేసే లారీ నుంచి ఇవి జారి పడి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News