: ఢిల్లీని వీడని పొగమంచు దుప్పటి... విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం


దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దుప్పటి ఇంకా వీడలేదు. గత నెల ఢిల్లీ వాసులను ముప్పుతిప్పలు పెట్టిన చలిపులి, ఈ నెలలోనూ తన ప్రతాపం చూపుతోంది. నిన్న రాత్రి నుంచి ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. దీంతో నేటి ఉదయం నుంచి నగరంలో రవాణా వ్యవస్థకు ఎక్కడికక్కడ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 50 విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండగా, ఐదు విమాన సర్వీసులను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. ఇక నగరంలో పొగమంచు కారణంగా ఇళ్ల నుంచి బయటకెళ్లేందుకు ఢిల్లీవాసులు సాహసించడం లేదు.

  • Loading...

More Telugu News