: సంక్రాంతి కోడి పందేల్లో ఘర్షణ... ఎనిమిది మందికి తీవ్ర గాయాలు


సంక్రాంతి కోడిపందాల్లో ఘర్షణ చోటుచేసుకుంది. మూడు రోజులుగా జోరుగా సాగుతున్న ఈ పందేలు నిన్నటిదాకా సజావుగానే సాగగా, చివరి క్షణాల్లో ఘర్షణ చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడలో కోడిపందేల సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొవ్వాడలో జరగుతున్న కోడిపందేలను చూసేందుకు నిన్న ఉదయం వచ్చిన ఓ యువకుడు బెట్టింగ్ కాసిన నేపథ్యంలో స్థానిక యువకుడు అనిల్ తో గొడవపడ్డాడు. ఈ గొడవ అప్పటికప్పుడు సద్దుమణిగినా తిరిగి సాయంత్రం ఆ యువకుడు తన బంధువులతో కొవ్వాడ చేరుకుని అనిల్ పై దాడికి దిగాడు. సమాచారం అందుకున్న అనిల్ బంధువులు సదరు యువకుడు, అతడి సంబంధీకులపై కత్తులతో దాడి చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News