: నా కొడుకు అమాయకుడు.. నిజాయతీపరుడు: సల్మాన్ తండ్రి అహ్మద్
ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళుతూ పోలీసులకు పట్టుబడ్డ సల్మాన్ మొహియుద్దీన్ ను అతడి తండ్రి అహ్మద్ మొహియుద్దీన్ వెనకేసుకొచ్చారు. తన కుమారుడు అమాయకుడని, నిజాయతీపరుడని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం కోసం వెళుతున్న తన కొడుకును పోలీసులు అకారణంగా అరెస్టు చేశారంటూ ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద వాపోయారు. హైదరాబాద్ లోని జేఎన్టీయూలో బీటెక్ చదివిన తన కొడుకు, లండన్ లో ఎంఎస్ చేశాడని ఆయన చెప్పుకొచ్చారు. ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సల్మాన్ కు పాప, బాబు ఉన్నారని తెలిపారు. ఉద్యోగం కోసం దుబాయి వెళుతున్న తన కొడుకును పోలీసులు అకారణంగా అరెస్టు చేసి తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించారు.