: నితిన్ లేకుండా జీవించలేను... హైదరాబాద్ లో పోలీసు అధికారి కూతురు హల్ చల్!


టాలీవుడ్ యువ హీరో నితిన్ పై వ్యామోహం పెంచుకున్న ఓ యువతి ఉదంతం హైదరాబాద్ లో నేటి తెల్లవారుజామున కలకలం సృష్టించింది. నేటి తెల్లవారుజామున వెలుగు చూసిన ఈ ఘటనతో పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎందుకంటే, సదరు యువతి ఓ పోలీసు అధికారి కూతురట. వివరాల్లోకెళితే... నిన్న రాత్రి 10 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని హీరో నితిన్ ఇంటి వద్దకు ఓ యువతి చేరుకుంది. సెక్యూరిటీ గార్డు కళ్లుగప్పి ప్రహరీ గోడ దూకి నితిన్ ఇంట్లోకి ప్రవేశించింది. చక్కగా కారిడార్ లో నిద్రపోయింది. తెల్లవారుజామున నితిన్ తల్లి ఆ యువతిని గుర్తించారు. ఎవరని ప్రశ్నించిన నితిన్ తల్లి, యువతి సమాధానం విని బిత్తరపోయారట. ‘‘నేను నితిన్ అభిమానిని. ఆయన కోసమే ఇక్కడికొచ్చా’’ అంటూ ఆ యువతి చెప్పడంతో నితిన్ తల్లి పోలీసులకు సమాచారమందించారు. తీరా అక్కడికొచ్చిన పోలీసులు సదరు యువతి ఓ పోలీసు అధికారి కూతురని తెలుసుకుని అవాక్కయ్యారట. ‘‘నితిన్ ను ప్రేమిస్తున్నాను. అతడు లేకుంటే జీవించలేను. అతడినే పెళ్లి చేసుకుంటాను’’ అని ఆ యువతి పోలీసులకూ చెప్పిందట. దీంతో యువతికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు ఆమెను ఇంటివద్ద వదిలేశారు.

  • Loading...

More Telugu News