: ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని మోదీ
దేశంలో సంస్కరణల్లో మరింత వేగాన్ని పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.2 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశ ఆర్ధిక వ్యవస్థను రూ.20 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలో సంస్కరణలకు మరింత వేగాన్ని జోడించడం ద్వారా ప్రపంచంలోనే భారత్ ను బలీయ శక్తిగా రూపుదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం సంస్కరణల్లో వేగం మాత్రమే సరిపోదని పేర్కొన్న ఆయన, మరింత దృఢమైన లక్ష్యం కలిగిన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన సంక్షేమమే లక్ష్యంగా సంస్కరణల్లో వేగాన్ని పెంచనున్నట్లు మోదీ పేర్కొన్నారు.