: విశాఖలో భారీ అగ్ని ప్రమాదం... అగ్నికి ఆహుతైన యాభై పూరిళ్లు
విశాఖపట్నం జిల్లాలో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పరిధిలోని పెదగంగవరంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 50 పూరిళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. గ్రామంలో అధిక శాతం గిరిజనేతరులు ఉంటున్నారు. గ్రామంలో అమలులో ఉన్న 1/70 యాక్టు నేపథ్యంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేదు. దీంతో గ్రామంలోని వారంతా పూరిళ్లలోనే నివాసముంటున్నారు. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం కావడంతో బాధిత కుటుంబాలన్నీ కట్టుబట్టలతో రోడ్డునపడ్డాయి.