: ఏపీలో డీఎస్సీ గడువు పెంపు
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ రాస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డీఎస్సీ దరఖాస్తు తుది గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడువును ఈ నెల 22 వరకు పెంచినట్టు ఏపీ విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఈ నెల 21 వరకు ఇంటర్నెట్ లో రుసుము చెల్లించేందుకు అవకాశం ఉందని తెలిపారు. వరుసగా సెలవులు రావడంతో గడువు పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టు సంధ్యారాణి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో డీఎస్సీ అభ్యర్థులకు ఊరట లభించినట్టైంది.