: దేశానికి సేవ చేసే అవకాశం నాకు లభించింది: మోదీ


భారత్ లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వృద్ధి రేటు 4 శాతానికి పడిపోయిందని... గతంలో జరిగిన నష్టాలను పూడ్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించిందని... ప్రజల ఆశలను తాను నెరవేరుస్తానని చెప్పారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం జాతీయ స్థాయిలో ఒకే మార్కెట్ ఉండేలా చూస్తామని వెల్లడించారు. బడ్జెట్లో పేర్కొన్నట్టు ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తామని మోదీ చెప్పారు.

  • Loading...

More Telugu News