: ప్యారిస్ కథ సుఖాంతం
వాయవ్య ప్యారిస్ కొలంబెన్ ప్రాంతంలోని ఓ పోస్టాఫీసులో ఆయుధాలు ధరించిన ఓ దుండగుడు ముగ్గురు వ్యక్తులను బందీలుగా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్యారిస్ లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే రంగంలోకి దిగిన పోలీసు బలగాలు చాకచక్యంగా వ్యవహరించి దుండగుడిని అరెస్ట్ చేశాయి. దీంతో, ముగ్గురు బందీలు సురక్షితంగా బయటపడ్డారు. కథ సుఖాంతం కావడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదుపులోకి తీసుకున్న దుండగుడిని విచారించేందుకు ప్యారిస్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే, దుండగుడుకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉండక పోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అస్పష్టతతో, తలాతోకా లేకుండా అతను మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. కాకపోతే, భారీ ఎత్తున గ్రెనేడ్లు, కలాష్నికోవ్ లు ధరించి ఉన్నాడని చెప్పారు.