: ప్యారిస్ లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదం


ఇస్లామిక్ తీవ్రవాదుల వరుస దాడులతో ప్యారిస్ నగరం అట్టుడుకుతోంది. ఈ రోజు మళ్లీ కలకలం రేగింది. గుర్తు తెలియని, ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి ముగ్గురు వ్యక్తులను పోస్టాఫీసులో బంధించాడు. ఇది ఉగ్రవాద చర్యే అని పోలీసులు భావిస్తున్నారు. వాయవ్య ప్యారిస్ ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ను పోలీసులు చుట్టుముట్టారు. భవనం పైభాగాన హెలికాప్టర్ తో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ప్యారిస్ లోని చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంతో పాటు మరో చోట జరిగిన ఉగ్రదాడుల్లో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News