: మసాలా కోసం ఇలాంటి ప్రశ్నలు వేయడం సరికాదు: చంద్రబాబు


ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. సమావేశం సందర్భంగా, బీజేపీ, టీడీపీల మధ్య సంబంధాలపై ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబు స్పందనను కోరారు. ఏపీ, తెలంగాణల్లో బీజేపీ విస్తరించాలనుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రశ్నను సంధించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు... 'మీకు మసాలా కావాలి' అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు మిత్రపక్షాలని... కేంద్రంలో బీజేపీకి తాము సపోర్ట్ చేస్తుండగా, రాష్ట్రంలో తమకు మద్దతుగా బీజేపీ ఉందని తెలిపారు. ఇలాంటి ప్రశ్నలు వేయడం సరికాదంటూ ముక్తాయించారు.

  • Loading...

More Telugu News