: నిలిచిపోయిన 'మెసెంజర్ ఆఫ్ ద గాడ్' సినిమా
వివాదాస్పద 'మెసెంజర్ ఆఫ్ ద గాడ్' సినిమా నిలిచిపోయింది. సినిమా ప్రదర్శనకు నిరసనగా అమృత్ సర్ తదితర ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబకడంతో, సినిమాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సినిమాకు సెన్సార్ ఇవ్వరాదని సెన్సార్ బోర్డు నిర్ణయించినప్పటికీ, అప్పీల్ లో దానికి ఓకే చెప్పారు. దీన్ని నిరసిస్తూ, సెన్సార్ బోర్డు ఛైర్మన్ పదవికి లీలా శాంప్సన్ రాజీనామా కూడా చేశారు. డేరా సచ్చా సౌధ అధ్యక్షుడు రామ్ రహీమ్ సింగ్ ఈ సినిమాలో నటించారు. సినిమా ప్రదర్శన నేపథ్యంలో, మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తుతాయని భావించిన అధికారులు సినిమాను పలుచోట్ల ఆపివేశారు. అల్లర్లు తలెత్తకుండా పోలీసులు భద్రత చర్యలను పటిష్ఠం చేశారు.