: జల్లికట్టులో వివాదం... పోలీసులపై స్థానికుల దాడి
పోలీసులపై స్థానికులు చేసిన దాడిలో ఎస్ఐ, కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఒత్తం గ్రామంలో జల్లికట్టు సందర్భంగా ఘర్షణ తలెత్తింది. జల్లికట్టు పందేలకు గ్రామస్తులు సిద్ధం కావడంతో, వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం తలెత్తి, క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. పోలీసులు లాఠీఛార్జికి దిగడంతో, స్థానికులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐకి, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. హెచ్చరికలు కూడా లేకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేశారని గ్రామస్తులు ఆరోపించారు.