: వైఎస్సార్ కుటుంబానికున్నంత నేర చరిత్ర మరెవ్వరికీ ఉండదు: టీడీపీ ఎమ్మెల్యే
వైకాపాపై వినుకొండ ఎమ్మెల్యే, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు విమర్శలు ఎక్కుపెట్టారు. రైతు సమస్యలపై ధర్నా చేస్తామని వైకాపా నేతలు అంటున్నారని... రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నప్పుడు ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న వైకాపా అధినేత జగన్ కు వ్యతిరేకంగా ముందు ధర్నా చేయాలని సూచించారు. దేశ చరిత్రలోనే వైఎస్సార్ కుటుంబానికి ఉన్నంత నేర చరిత్ర మరెవ్వరికీ ఉండదని ఆరోపించారు. ప్రజల అభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతుంటే... దానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తారా? అంటూ మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆంజనేయులు ఈ వ్యాఖ్యలు చేశారు.