: వార్నర్ సెంచరీ... గెలుపు దిశగా ఆస్ట్రేలియా


ఇంగ్లండ్ బౌలర్లపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ విరుచుకుపడ్డాడు. ముక్కోణపు సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్ శతకం సాధించాడు. 97 బంతుల్లో 14 ఫోర్లతో వార్నర్ సెంచరీ పూర్తయింది. దీంతో, వన్డేలలో మూడో శతకాన్ని వార్నర్ నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు. వార్నర్ (113), మ్యాక్స్ వెల్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయం కోసం మరో 13.4 ఓవర్లలో ఆసీస్ 36 పరుగులు చేయాలి. అంతకు ముందు స్మిత్ (37), బెయిలీ (10) ఔట్ అయ్యారు.

  • Loading...

More Telugu News