: మా నేతలే మీకు దిక్కు... బీజేపీపై విరుచుకుపడ్డ ఆప్
ప్రధాని మోదీ మ్యాజిక్ ఢిల్లీలో పని చేయదు కాబట్టే ఆప్ నేతలను బీజేపీలోకి చేర్చుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ నిన్న బీజేపీలో చేరి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ఢిల్లీ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆప్ నేతలే బీజేపీకి దిక్కని, ఆ పార్టీకి ప్రజల్లో మంచివారుగా గుర్తింపున్న నాయకులు లేకనే తమవారిని ఆహ్వానిస్తున్నారని, తమ నేతలను ఎంతమందిని బీజేపీలో చేర్చుకున్నా, ఢిల్లీ ప్రజలు తమ వెంటే వున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.