: ఢిల్లీ - ఆగ్రా రహదారి మూసివేత!
ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ - ఆగ్రా ఎక్స్ ప్రెస్ వేను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఒబామా ఆగ్రాను సందర్శించాలని నిర్ణయించుకోవడంతో, ఆయన భద్రతా ఏర్పాట్ల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత గణతంత్ర దినోత్సవానికి అతిథిగా విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. 27న ఆయన ఆగ్రాకు వెళ్లి తాజ్ మహల్ వద్ద కాసేపు గడపనున్నారు. కాగా, ఢిల్లీ - ఆగ్రా రహదారి వెంటవున్న అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు మూసివేయాలని కూడా అధికారులు నిర్ణయించారు.