: విడాకులు పొందిన భార్య భరణానికి భర్త కట్టుబడాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు
విడాకులు పొందిన తరువాత, భార్య విద్యావంతురాలై వుండి ఉద్యోగం చేయగల స్థితిలో వుంటే భర్త ప్రతినెలా భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు ఒకటి అభిప్రాయపడింది. భార్య అవసరాల బాధ్యతకు మాజీ భర్త కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మోనా కర్కెట్ట తెలిపారు. గృహహింస కింద దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగిగా ఉండి సంపాదన లేకుంటే, దైనందిన అవసరాల కోసం కొంత భరణం పొందే హక్కు భార్యకు ఉంటుందని జడ్జి తెలిపారు. అది కూడా భర్తకు లభిస్తున్న ఆదాయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.