: ఎల్లుండి హైదరాబాద్ పరిధిలో పల్స్‌ పోలియో


ఈనెల 18న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పల్స్‌ పోలియో కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ నేడు తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. అందరికీ వాక్సిన్ ని అందుబాటులో ఉంచేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ కూడళ్లలో చుక్కల మందు అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు. 5.48 లక్షల మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తామని, మొత్తం 3,200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News