: ఉబెర్ పై కేసు వేసేందుకు న్యూయార్క్ టాప్ లాయర్ తో బాధితురాలి డీల్!


ముందూ వెనకా విచారించకుండా నేర ప్రవృత్తి గలవారికి డ్రైవర్ ఉద్యోగాలు ఇచ్చినందుకు క్యాబ్ సేవల కంపెనీ ఉబెర్ పై శాన్ ఫ్రాన్సిస్కోలో కేసు వేయాలని ఓ బాధితురాలు భావిస్తోంది. ఇందుకోసం న్యూయార్క్ లోని అత్యంత ప్రముఖ లాయర్లలో ఒకరైన డగ్లస్ విగ్డోర్ ను ఆమె సంప్రదించింది. ఈ విషయాన్ని విగ్డోర్ స్వయంగా వెల్లడించారు. ఉబెర్ పై అమెరికా చట్టాల ప్రకారం కేసు వేయవచ్చో? లేదో? పరిశీలించాలని ఆమె కోరినట్టు గార్డియన్ పత్రికకు ఆయన తెలిపారు. కాగా, ఐఎంఎఫ్ మాజీ చీఫ్ డొమినిక్ స్ట్రాస్-ఖాన్ న్యూయార్క్ హోటల్ పనిమనిషి నఫీసా డియాలోను వేధించాడని ఆరోపణలు వచ్చినపుడు విగ్డోర్ బాధితురాలి తరపు వాదించి 6 మిలియన్ డాలర్లు స్ట్రాస్-ఖాన్ నుంచి వసూలు చేసి పేరు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News