: కేసీఆర్ మనవడు వచ్చినా అది పూర్తికాదు: జీవన్ రెడ్డి


తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కేజీ టు పీజీ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని టీకాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎంతో గొప్పదైన ఈ పథకాన్ని పట్టాలెక్కించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు వచ్చినా కేజీ టు పీజీ పథకం పూర్తికాదని ఎద్దేవా చేశారు. విద్యా హక్కు చట్టాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News