: ‘గోపాల గోపాల’పై చర్యలు తీసుకోండి: టీ మంత్రికి న్యాయవాదుల ఫిర్యాదు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేశ్ ల తాజా చిత్రం ‘గోపాల గోపాల’ తమను కించపరిచేలా ఉందని న్యాయవాదులు తెలంగాణ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ చిత్రంలో తమను కించపరిచేలా కొన్ని దృశ్యాలున్నాయన్న న్యాయవాదులు, చిత్రంపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. నేటి ఉదయం సచివాలయంలో మంత్రిని కలిసిన న్యాయవాదులు... తెలంగాణ న్యాయవాదుల సంఘం నూతన సంవత్సర కేలండర్ ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పనిలో పనిగా వారు 'గోపాల గోపాల' చిత్రంపై ఫిర్యాదు చేశారు.