: కేసీఆర్ కు రేపు నివేదిక అందించనున్న తుమ్మల


తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శాఖకు సంబంధించిన నివేదికను టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేపు అందించనున్నారు. రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ రోజు సచివాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గోదావరి నదిపై మూడు బ్రిడ్జిల నిర్మాణాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలను పంపామని తెలిపారు. డ్రెపోర్టుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... అయితే, వీటిని ఎక్కడ నిర్మించాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News