: ప్రొద్దుటూరులో వేలకొద్ది 'గోపాల గోపాల', 'ఐ' పైరసీ సీడీలు... ముగ్గురి అరెస్ట్‌


ఇటీవల విడుదలైన పవన్, వెంకటేష్ ల చిత్రం 'గోపాల గోపాల', శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐ' తదితర కొత్త చిత్రాలకు చెందిన వేలకొద్దీ పైరసీ సీడీలు కడప జిల్లా ప్రొద్దుటూరులో లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో పైరసీ సీడీలు పెద్దఎత్తున విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు జరిపి వివిధ సినిమాలకు చెందిన మూడు వేలకుపైగా సీడీలను స్వాధీనం చేసుకున్నారు. గోపాల గోపాల, ఐ, చిన్నదానా నీ కోసం, లక్ష్మి రావే మా ఇంటికి, రఘువరన్ బీటెక్ తదితర సినిమాల పైరసీ సీడీలు పోలీసులకు లభించినట్టు తెలిసింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు ప్రొద్దుటూరు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News