: పని గంటలు పెరిగితే... మద్యానికి బానిస అవుతారట!


వారానికి 48 గంటలకన్నా ఎక్కువ పని చేసేవారు మద్యానికి బానిస అవుతారంటూ ఒక పరిశోధన సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, పని ఒత్తిడి కారణంగా వారానికి 21 మంది పురుషులు, 14 మంది మహిళలు మద్యానికి బానిస అవుతున్నారట. మద్యం సేవించడం వల్ల పని ఒత్తిడి, శారీరక శ్రమ నుంచి ఉపశమనం పొందవచ్చని అత్యధికులు భావిస్తున్నారు. 14 దేశాల్లోని 3,33,693 మందిపై జరిపిన సర్వేలో ఈ నిజాలు వెలుగుచూశాయి. మద్యానికి బానిసలు అవుతుండటంతో, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు వీరు గురవుతున్నారని కూడా సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News