: బోగస్ ఓట్ల తొలగింపునకు చర్యలు: నూతన సీఈసీ హెచ్ఎస్ బ్రహ్మ
దేశంలో బోగస్ ఓట్ల ఏరివేతకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన ఆయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉంటే, వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. తద్వారా దేశంలో బోగస్ ఓట్ల బెడదను తప్పించనున్నామని తెలిపారు. 1975 ఏపీ కేడర్ కు చెందిన ఐ.ఎ.ఎస్ అధికారి అయిన ఆయన ఎన్నికల సంఘంలో కమిషనర్ గా ఉంటూనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే.