: చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు ప్రారంభం... భారీగా తరలివచ్చిన జనం


చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో కొద్దిసేపటి క్రితం ఈ ఉత్సవం ప్రారంభమైంది. పలు అలంకరణలతో ముస్తాబైన ఎద్దులు పరుగులు పెడుతున్నాయి. వీటిని పట్టుకునేందుకు యువత కూడా వాటి వెంట పరుగులు తీస్తున్నారు. జల్లికట్టుకు అనుమతి లేదని, నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హెచ్చరికలు ఏమాత్రం పనిచేయలేదు. ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వీధుల్లోనే కాక మేడలపైనా చేరిన జనం జల్లికట్టును ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో కోలాహలం నెలకొంది.

  • Loading...

More Telugu News