: ఇది నా జీవితపోరు... కేజ్రీవాల్ తో ప్రత్యేక్ష యుద్ధానికి సిద్ధం: కిరణ్ బేడి
"నా జీవిత కాలంలో ఇదే అతిపెద్ద పోరు. కేజ్రీవాల్ నియోజకవర్గంలో ఆయనతో పోటీకి నేను సిద్ధంగా వున్నాను. ఓడిపోయినా లెక్క చేయను" అని నిన్న బీజేపీలో చేరిన మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడి వ్యాఖ్యానించారు. ఆమెను కేజ్రీవాల్ పై పోటీకి నిలబెట్టాలని బీజేపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి 2011 వరకూ బేడీ, కేజ్రీవాల్ లు ఇద్దరూ అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కలసి పని చేశారు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించిన తరువాత ఇద్దరూ విడిపోయారు. అయితే, కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా బేడీ పోటీ చేసే విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.