: ఐఐఎం భూ సేకరణలో పట్టాలు లేని భూమికీ పరిహారం: ఏపీ మంత్రి గంటా
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కోసం సేకరిస్తున్న భూమిలో పట్టాలు లేని భూమి కలిగిన రైతులకు చంద్రబాబు సర్కారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈమేరకు పట్టాలు లేని భూములకు కూడా పరిహారం చెల్లించే దిశగా ఆలోచన చేస్తున్నామని ఏపీ మానవనవరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖలో ప్రతిపాదిత స్థలంలో ఐఐఎంకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంటా ఐఐఎం ఏర్పాటు కానున్న ప్రాంతాన్ని కొద్దిసేపటి క్రితం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మంత్రిని కలిశారు. బాధితుల సమస్యలు విన్న మంత్రి, పట్టాలు లేని భూమికీ పరిహారం చెల్లించే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు.