: రెచ్చిపోయిన పిచ్చికుక్క... ఇరవై మందికి గాయాలు... మందులు లేవని చేతులెత్తేసిన వైద్యులు


రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం బూచన్ పల్లిలో పిచ్చిపట్టిన ఓ కుక్క స్వైరవిహారం చేసింది. కనిపించిన వారందరిపైనా దాడి చేసి తన ప్రతాపాన్ని చూపించింది. ఈ కుక్క సుమారు 20 మందిపై దాడి చేసింది. కుక్క కాటుకు గురైనవారు మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి వెళ్ళగా, అక్కడి వైద్యులు కుక్కకాటుకు మందులు లేవని చేతులెత్తేశారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై కొందరిని మెదక్ జిల్లా సదాశివపేటకు, మరికొందరిని సంగారెడ్డి ఆసుపత్రులకు తరలించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News