: ఈ ఉగ్రవాదుల శవాలను ఏం చేద్దాం?... ప్రజలను సలహా కోరిన ఫ్రాన్స్
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ఒక పత్రికా కార్యాలయంపై దాడిచేసి, ఆ తరువాత పోలీసు కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల శవాలను ఏం చేయాలన్న విషయమై ఆ దేశ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఉగ్రదాడికి కారణమైన అమేడి కౌలిబాలీ, చెరీఫ్ కోవాచి, సయీద్ కోవాచిలను ఫ్రాన్స్ పోలీసులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలు ప్రస్తుతం పోలీసుల వద్దే ఉన్నాయి. వీటిని ఖననం చేస్తే, ఆ ప్రదేశాన్ని భవిష్యత్తులో ఉగ్రవాదులు స్మారక చిహ్నాలుగా మార్చవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ మృతదేహాలను ఏం చేయాలో తెలపాలని పోలీసులు ప్రజలను కోరారు.