: ఢిల్లీలో పగిలిన ఐజీఎల్ గ్యాస్ పైపు... భారీగా ఎగసిపడుతున్న మంటలు


దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ కారణంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటికే మూడు కార్లు కాలి బూడిదయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు పది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మెట్రో రైల్వే పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో ఐజీఎల్ కు చెందిన గ్యాస్ పైపు పగిలిపోయింది. పగిలిన పైపుల నుంచి గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడంతో ప్రమాదం సంభవించింది. ఆ ప్రదేశానికి సమీపంలోనే టీటీడీ శ్రీ వెంకటేశ్వర కళాశాల ఉంది. ప్రమాదం నేపథ్యంలో కళాశాల విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

  • Loading...

More Telugu News