: రెవెన్యూ లోటు భర్తీ చేయండి: కేంద్ర ఆర్థిక మంత్రికి చంద్రబాబు వినతి
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. భేటీలో భాగంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో నెలకొన్న రెవెన్యూ లోటును భర్తీ చేయాలని చంద్రబాబు, జైట్లీని కోరనున్నట్లు సమాచారం. అంతేకాక రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, విభజన చట్టం హామీల అమలునూ చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా జైట్లీతో భేటీలో పాల్గొంటున్నారు. ఈ భేటీ తర్వాత చంద్రబాబు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తోనూ భేటీ కానున్నారు.