: ఈ పాప లక్ష్మీ పుత్రికే!... నెల రోజుల పాపకు ఇరవై నాలుగు లక్షల రూపాయల బహమతి
భూమిపై పడిన రోజుల వ్యవధిలో ఓ పాప లక్షాధికారి అయింది. నెల రోజులైనా నిండని ఆ పాప రూ.24 లక్షల రూపాయల బహుమతి అందుకుంది. వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన అనిల్ జనార్థనన్ అపుడే పుట్టిన తన కుమార్తె కోసం 20వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో నగలు కొన్నాడు. ఫెస్టివల్ లో తన కుమార్తె నితేరా జనార్థనన్ పేరు మీద మూడు కూపన్లను తీసుకున్నాడు. లక్కీ డ్రాలో నితేరా పేరు మీద ఉన్న కూపన్ కు 1,40,000 దిర్హామ్స్ విలువైన బంగారు, వజ్రాల నగలు బహుమతిగా లభించాయి. భారత కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ.24 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడా తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. లక్షల రూపాయల విలువైన బహుమతి గెలుచుకున్న ఆ చిన్నారి నిజంగా లక్ష్మీ పుత్రికే!