: మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్


ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒక్క పరుగు కూడా జోడించకుండానే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ఇయాన్ బెల్ తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. వన్ డౌన్ లో దిగిన టేలర్ మూడో బంతికి అవుట్ అయ్యాడు. వీరిద్దరినీ స్టార్క్ తన అద్భుత బౌలింగుతో అవుట్ చేశాడు. ఆపై మూడో ఓవర్ తొలి బంతికి కుమిన్స్ బౌలింగులో రూట్ 5 పరుగుల వద్ద వాట్సన్ కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 8 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News