: ఏపీ సీఎం సొంత మండలంలో నేడు జల్లికట్టు... పోలీసు నిషేధాజ్ఞలు బేఖాతరు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత మండలం చంద్రగిరిలో నేడు జల్లికట్టు ఉత్సవం ఉత్సాహంగా సాగనుంది. మండలంలోని ఏ.రంగంపేట, రామిరెడ్డిపల్లి, పుల్లయ్యగారిపల్లి, నాగయ్యవారిపల్లిల్లో జల్లికట్టుకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని తమిళనాడులో వేడుకగా జరిగే జల్లికట్టు, ఆ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న చిత్తూరు జిల్లాలోనూ ఏటా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా సదరు గ్రామాల్లో జల్లికట్టు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జల్లికట్టుపై నిషేధం ఉన్న నేపథ్యంలో, ఉత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జల్లికట్టు జరుగుతుందని భావిస్తున్న గ్రామాల్లో ఆంక్షలు విధించామని చెప్పిన పోలీసులు, ఎడ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నిషేదాజ్ఞలను బేఖాతరు చేస్తున్న ప్రజలు జల్లికట్టు నిర్వహణకు భారీ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈ ఉత్సవాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాలుపంచుకునే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News