: విదేశీ యాత్రల పేరిట మోసం... సింగపూర్, మలేసియాల్లో చిక్కుకుపోయిన అరవై మంది తెలుగువారు
విదేశీ విహారయాత్రల పేరిట 'స్కైలైన్' అనే సంస్థ పలువురు తెలుగువారిని మోసం చేసింది. యాత్రల పేరిట విదేశాలకు పంపి ఆ సంస్థ చేతులు దులుపుకోవడంతో, సింగపూర్, మలేసియాల్లో 60 మంది దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్నారు. తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు లేక సింగపూర్‌లో 30 మంది చిక్కుకోగా, ఉత్తరాంధ్రకు చెందిన 30 మంది చెన్నయ్ లో పడిగాపులుగాస్తున్నారు. మలేషియాలో మరో 30 మంది చిక్కుకున్నట్లు సమాచారం. దుబాయ్ టూర్ పేరిట 'స్కైలైన్' యాజమాన్యం 75 మంది నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేసి పరారైనట్టు తెలుస్తోంది.