: ఎయిర్ అరేబియా విమానం సీటు కింద మూడు కిలోల బంగారం... శంషాబాద్ లో పట్టివేత


దేశంలోకి అక్రమ మార్గాల్లో బంగారం తరలింపు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై కస్టమ్స్ అధికారులు నిఘా పెంచడంతో అక్రమ రవాణాదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 2.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ అరేబియా విమానంలో సోదాలు చేసిన అధికారులు విమానంలోని ఓ సీటు కింద ఉన్న బంగారాన్ని కనుగొన్నారు. తనిఖీల నేపథ్యంలో సీటు కింద పెట్టిన బంగారాన్ని వదిలేసిన వ్యక్తి విమానం దిగేశాడు. అయితే సదరు సీటులో కూర్చున్న వ్యక్తి వివరాలను విమాన సిబ్బంది నుంచి సేకరించిన కస్టమ్స్ అధికారులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News