: ఎకనమిక్ టైమ్స్ సదస్సులో నేడు చంద్రబాబు ప్రసంగం... ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీలో జరగనున్న ఎకనమిక్ టైమ్స్ సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నేడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు. అనంతరం ఆయన ఎకనమిక్ టైమ్స్ గ్రూపు నిర్వహిస్తున్న బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వ్యాపారవేత్తలు పాలుపంచుకోనున్న ఈ భేటీలో, ఏపీకి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా చంద్రబాబు తన ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ భేటీలో పాల్గొనే మెజారిటీ వ్యాపారవేత్తలకు తన సందేశం వెళ్లేలా ఆయన పక్కాగా ప్రణాళిక రచించుకున్నట్లు సమాచారం.