: హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా రాందేవ్ బాబా నియామకం!
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు నేటి సాయంత్రం హర్యానా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హరిద్వార్ లోని దివ్య యోగా మందిర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ ఈ విషయాన్ని ప్రకటించారు. బాబా రాందేవ్ పర్యవేక్షణలో రాష్ట్రంలో 25 వేల ఆయుర్వేద మొక్కలను పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా తన నియామకం పట్ల బాబా రాందేవ్ సంతోషం వ్యక్తం చేశారు.