: విశాఖ కైలాసగిరిలో అగ్ని ప్రమాదం... ఘటనపై మంత్రి అయ్యన్న ఆరా
విశాఖ పరిధిలోని కైలాసగిరి కొండపై నేటి సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. కొండపై చెత్త డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. డంపింగ్ యార్డులో చెత్త వేస్తుండగా ఒక్కసారిగా మంటలు రేగాయి. వెనువెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘటనపై ఆరా తీశారు. ప్రమాద కారణాలు, జరిగిన నష్టంపై ఆయన అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.