: అసోం మారణకాండ హంతకుల అరెస్ట్


అసోంలో ఇటీవల మారణకాండ సృష్టించిన హంతకులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఘటనకు బాధ్యులైన నిషేధిత బోడో మిలిటెంట్లను నేటి మధ్యాహ్నం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. బోడో మిలిటెంట్లలో కీలక నేతలుగా పరిగణిస్తున్న ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆప్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్ బీ)లోని సాంగ్ బిజిత్ ముఠాకు చెందిన తీవ్రవాదులు గత నెలలో రాష్ట్రంలోని సోనిట్ పూర్, కోక్రాఝార్ జిల్లాల్లో మారణకాండకు దిగారు. బోడోల దాడుల్లో 85 మంది అమాయకులైన ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News