: సరిహద్దుల్లో అప్రమత్తంగానే ఉన్నాం: రక్షణ శాఖ మంత్రి పారికర్
దేశ సరిహద్దుల్లో అప్రమత్తంగానే ఉన్నామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. భారత సైన్యం అప్రమత్తంగా ఉన్నందునే పాక్ చొరబాటుదారుల దురాక్రమణలు సఫలం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నేటి మధ్యాహ్నం భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు యత్నించిన ఉగ్రవాదులను సైన్యం సమర్థంగా నిలువరించిందని, సైన్యం కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదుల చొరబాట్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న సైన్యాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఉగ్రమూకల చొరబాట్లపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ఆయన వెల్లడించారు.