: ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ... విభజన చట్టం హామీలపై చర్చ


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, ఉమా భారతిలతో భేటీ అయ్యారు. ఉమా భారతితో భేటీ ముగించుకున్న చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ప్రధానితో భేటీ కొనసాగుతోంది. రాష్ట్ర పునర్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలపై ఇరువురు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న పలు హామీల అమలుకు సంబంధించి చంద్రబాబు, ప్రధాని మోదీతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News