: చంద్రబాబును ‘సంక్రాంతి’ భోజనానికి ఆహ్వానించా: వెంకయ్యనాయుడు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును సంక్రాంతి సందర్భంగా భోజనానికి ఆహ్వానించానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీల కారణంగా బిజీబిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వెంకయ్యతోనూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్య, చంద్రబాబును విందుకు ఆహ్వానించానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని వెంకయ్య అన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు జరుపుతున్న భేటీలు రాష్ట్రాభివృద్ధికి రాచబాటలు వేయనున్నాయన్నారు. ఏపీకి అందించనున్న వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలపై కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా రేపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోనూ భేటీ కానున్నట్లు తెలిపారు. ఈ భేటీలో తనతో పాటు చంద్రబాబు కూడా పాలుపంచుకుంటారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News