: లారీని ఢీకొన్న కారు... నలుగురు సజీవ దహనం
సంక్రాంతి పర్వదినాన నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ నేపథ్యంలో చెలరేగిన మంటల్లో కారు కాలి బూడిదైంది. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో కారుతో పాటు అందులోని నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాచపాలెం సమీపంలో జాతీయ రహదారిపై కొద్దిసేపటి క్రితం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి నెల్లూరు వస్తున్న నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు.